గూగుల్ న్యూస్‌లో మాతో చేరండిSamayam Telugu

Illu Illalu Pillalu Today జూలై 14 ఎపిసోడ్: ప్రేమని పోలీస్ ఆఫీసర్‌ని చెయ్‌రా చిన్నోడా.. అభయం ఇచ్చిన రామరాజు.. భగ్నం చేసేందుకు శ్రీవల్లి బాణం

Authored byశేఖర్ కుసుమ|Samayam Telugu
Subscribe

Illu Illalu Pillalu July 14th Episode: ప్రేమని పోలీస్ ఆఫీసర్ చేయాలనేది ధీరజ్ కల. అది ప్రేమ కల కూడా కావడంతో ఎలాగైనా కోచింగ్ సెంటర్‌లో జాయిన్ చేయాలని అనుకుంటాడు. అయితే రామరాజు ఒప్పుకోడు కాబట్టి.. అతన్ని ఒప్పించే ప్రయత్నంలో సూపర్ సక్సెస్ అయ్యాడు. ఈరోజు (జూలై 14) రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్‌లో ఏమైందంటే.. 

Illu Illalu Pillalu Serial Today
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్
ప్రేమను ఎలాగైనా పోలీస్ ఆఫీసర్ చేయాలని ఫిక్స్ అవుతాడు ధీరజ్. అదే సమయంలో సాగర్ రామరాజును అవమానిస్తూ మాట్లాడుతుంటే వేదవతితో కలిసి ప్రేమను పోలీస్ ఆఫీసర్ చేసేందుకు రామరాజును ఒప్పించేలా ప్లాన్ చేస్తాడు ధీరజ్. ఈరోజు రాత్రి (జూలై 14న) వచ్చే ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే.. "తను తల్చుకుంటే తెల్లారేసరికల్లా పోలీస్ ఆఫీసర్ అవ్వగలదు. అది తెలుసుకో" అంటుంది వేదవతి. "ఇప్పటిదాకా తల్చుకోలేదమ్మా..కానీ నడిపోడే బావిలో కప్పలని అన్నాడు చూడు. ఆ క్షణమే ప్రేమతోపాటు నేను కూడా సీరియస్ గా తల్చుకున్నా" అంటాడు ధీరజ్."అంటే నువ్వు కూడా పోలీస్ ఆఫీసర్ అవుతావా" అంటుంది వేదవతి అనుమానంగా. "లేదమ్మా. దగ్గరుండి ప్రేమను పోలీస్ ఆఫీసర్ చేస్తాను. ఇప్పుడే ఈ క్షణమే ప్రేమను తీసుకెళ్లి పోలీస్ అకాడమీలో జాయిన్ చేస్తాను. నెక్ట్స్ నోటిఫికేషన్ లో ఎస్సై పోస్ట్ కొట్టేలా చేస్తాను" అంటాడు ధీరజ్ ధీమాగా. దీంతో సాగర్ పడి పడి నవ్వుతాడు. "ప్రేమ జస్ట్ ట్యూషన్ క్లాస్ చెప్తేనే మీ ఆయన నట్టింట్లో మూడో ప్రపంచ యుద్దాన్ని కురుక్షేత్రాన్ని సృష్టించాడు. అలాంటి మొండి మనిషి కోడల్ని ఎస్సై కోచింగ్ కు పంపిస్తాడా.. ఆయన వితండవాదం గురించి తెలిసి కూడా మీరు అలా మాట్లాడుతుంటే నవ్వకుండా ఏం చేస్తానమ్మా"అంటూ సాగర్ నవ్వుతూనే ఉంటాడు.

ఈ రామరాజు అంటే కొండగొర్రె అనుకున్నారా..? కట్టిపెట్టండి మీ నాటకాలూ

ఈ రామరాజు అంటే కొండగొర్రె అనుకున్నారా..? కట్టిపెట్టండి మీ నాటకాలూ

"నడిపోడు అలా మాట్లాడుతుంటే మీరు మౌనంగా ఉన్నారేంటండీ. వాడి నోరు మూయించడం కోసం ప్రేమను పోలీస్ కోచింగ్ కు పంపిస్తానని చెప్పండి" అంటుంది వేదవతి. "ఆపండి మీ డ్రామాలు. వాడి మాటలు అవకాశంగా తీసుకుని ప్రేమను పోలీస్ కోచింగ్ కు పంపించాలని మీరందరూ ప్లాన్ చేస్తున్నారు. వాడేదో రెచ్చగొట్టేలా మాట్లాడితే నేను రెచ్చిపోయి ఒప్పుకుంటానని అనుకుంటున్నారా.. అది జరగని పని మీ డ్రామాలు ఆపండి"అంటాడు రామరాజు కోపంగా. "నేను చెప్పానా.. ఆయన గురించి నాకు తెలియదా ఏంటీ" అంటూ వెళ్లిపోతాడు సాగర్. దీంతో నర్మద రామరాజును రిక్వెస్ట్ చేస్తుంది. "మామయ్య.. ప్రేమ చదువుకుంది. పోలీస్ ఆఫీసర్ అవ్వాలనేది తన డ్రీమ్. ఆ డ్రీమ్ నిజమైతే తను చాలా హ్యాపీగా ఉంటుంది. తన ఆలోచనను కూడా అర్థం చేసుకోండి" అని అంటుంది నర్మద.

ఆడాళ్లు జాబ్ చేస్తే తప్పేంటి??? మళ్లీ మొదలెట్టార్రోయ్

ఆడాళ్లు జాబ్ చేస్తే తప్పేంటి??? మళ్లీ మొదలెట్టార్రోయ్

"తనను జాబ్ కు పంపిస్తే ఎదురింటివాళ్లు గొడవకు వస్తారని.. అది జరగని పని అని గతంలో నేను చాలాసార్లు చెప్పాను" అంటాడు రామరాజు. "ఏవండి.. ఒకవైపు చదువుకుంటూ జాబ్ చేస్తే మావాళ్లకు సమస్యగానీ.. చదువు అయిపోయాక ఉద్యోగం చేస్తే మావాళ్లకు వచ్చిన బాధేంటండీ.. లోకంలో చదువుకున్న వాళ్లు ఎంతమంది జాబ్ చేయట్లేదు. ఒకవేళ మావాళ్లు గొడవకు వస్తే మనం సమాధానం చెప్పలేమా ఏంటీ" అంటుంది వేదవతి. "నాన్న నర్మద జాబ్ చేస్తుంది. అలాగే ప్రేమ కూడా జాబ్ చేస్తా అంటుంది. అందుకు మీరు ఒప్పుకోకపోతే మీ కోడళ్ల విషయంలో పక్షపాతం చూపిస్తున్నారని అందరూ అనుకోరా.. దానివల్ల మీకు మాట రాదా చెప్పండి" అంటాడు చందు.

ప్రేమ పోలీస్ ఆఫీసర్ అవ్వాలి.. ఒప్పుకోండి మామయ్యా..

ప్రేమ పోలీస్ ఆఫీసర్ అవ్వాలి.. ఒప్పుకోండి మామయ్యా..

వల్లి టెన్షన్ పడుతూనే మధ్యలో మాట్లాడుతూ.. "అవుననండి మామయ్యగారండీ.. అందుకే ప్రేమ పోలీస్ ఆఫీసర్ అవ్వడానికి ఒప్పకోండి. మన ఇంట్లో పోలీస్ ఉంటే మనకే మంచిది కదా" అంటుంది వల్లి. "అవును. చాలా మంచిది. కొంతమంది ఇంటి దొంగలను ఇట్టే పట్టేసుకోవచ్చు" అంటుంది వేదవతి వెటకారంగా. "అబ్బా.. ఈవిడకు టైమ్ దొరికితే చాలు మాటలతో కుళ్లబోడిసేస్తుంది. ఇస్తా.. అన్నింటికి వడ్డితో సహా ఇచ్చేస్తా" అని మనసులోనే అనుకుంటుంది వల్లి. "ఏవండీ ...ఒకవేళ ప్రేమ స్థానం మన అమూల్య ఉంటే ఇలాగే ఆలోచిస్తారా " అంటుంది వేదవతి. దీంతో నర్మద, చందు, ధీరజ్, వేదవతి అందరూ రామరాజును బతిమాలుతూ ఉంటారు.

మీరు వద్దంటే నా డ్రీమ్ వదిలేస్తాను మామయ్యా..

మీరు వద్దంటే నా డ్రీమ్ వదిలేస్తాను మామయ్యా..

కానీ రామరాజు మాత్రం వినిపించుకోడు.. దాంతో ప్రేమ.. రామరాజు దగ్గరకు వచ్చి "మామయ్యా.. పోలీస్ ఆఫీసర్ అవ్వాలనేది నా డ్రీమ్. కానీ మీకు ఇష్టం లేకపోతే నా డ్రీమ్ వదిలేసుకుంటాను మామయ్య.. అంతేతప్ప మీ మాటను దాటి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేలా ప్రవర్తించను" అంటుంది ప్రేమ. "చూడమ్మ.. నాకు నా కూతురు ఎలాగో నువ్వు అలాగే. కూతురి ఇష్టాన్ని కాదనే ముర్ఖున్ని కాదు నేను. కాకపోతే చిటికిమాటికి మీ వాళ్లు ఇంటిమీదకు గొడవకు వస్తున్నారనే నేను వద్దని చెప్పాను. అంతేకానీ నీ ఇష్టాన్ని నేనెందుకు శాసిస్తాను. నీ కలను నేనెందుకు చంపుకోమంటాను" అంటాడు రామరాజు.

అద్దీ లెక్కా.. ఒప్పేసుకున్నాడ్రోయ్

అద్దీ లెక్కా.. ఒప్పేసుకున్నాడ్రోయ్

"రేయ్.. మీ నాన్న ఒప్పేసుకున్నారు. కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకో" అంటుంది వేదవతి. దీంతో రామరాజు కాళ్లకు మొక్కుతుంది ప్రేమ. "కాకపోతే.. మీ వాళ్లు గొడవకు రాకుండా చూసుకో అమ్మ" అని వెళ్లిపోతాడు రామరాజు. ఇక రామరాజు ఒప్పుకోవడంతో ధీరజ్ సంతోషంతో పొంగిపోతాడు. అదే సంతోషంలో బయటే ఉన్న సాగర్ ను ఎత్తుకుని థ్యాంక్స్ చెబుతాడు. "ఏమైందీరా నీకు.. తిక్క తిక్కగా ప్రవర్తిస్తున్నావు " అంటాడు సాగర్. "రేయ్ నడిపోడా.. నీ ఓవర్ యాక్షన్ కూడా ఒక మంచి పని చేస్తుందని నాకు అర్థమైందిరా. ఇందాకా ఫోన్ లో నువ్వు చేసిన ఓవర్ యాక్షన్ వాళ్ల.. ప్రేమను పోలీస్ ఆఫీసర్ చేయడానికి నాన్న ఒప్పుకున్నార్రా" అంటూ మురిసిపోతాడు ధీరజ్. ఈ మాటలన్నీ దూరంగా నిలబడి వింటూ రగిలిపోతుంది వల్లి.

నడిపోడా.. నువ్వు తోపెహే.. ‘ఆయన వల్లే కదా సొంత ఇంట్లో కూడా పగోడిగా ఉంటున్నా’

నడిపోడా.. నువ్వు తోపెహే.. ‘ఆయన వల్లే కదా సొంత ఇంట్లో కూడా పగోడిగా ఉంటున్నా’

"రేయ్.. ఏం మాట్లాడుతున్నావు రా.. ఇది మాములు వింతకాదు రా సామీ.. రూల్స్ రామరాజు గారు మెండితనాన్ని పక్కనపెట్టుకుని ఒప్పుకున్నారంటే నో డౌట్ రా.. తొందర్లోనే భూమి అంతరించిపోతుంది ఇది కన్ఫార్మ్" అంటాడు సాగర్ వెటకారంగా. "మీ నాన్న చాలా మంచివారు రా. ఆయన ఏం చేసినా.. ఏం ఆలోచించినా ఒకటికి వందసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటార్రా.. మీ నాన్నను అర్థం చేసుకోలేకపోతే ఎలా రా నడిపోడా" అంటుంది వేదవతి. "అమ్మా తల్లి.. నువ్వు మీ ఆయన మీద ఒక చిన్న మాట కూడా పడనివ్వు అని నాకు ముందే తెలుసు. మీ ఆయన ఎంత బాగా అర్థం చేసుకుంటారో చెప్పడానికి నేను ఉదాహరణ. ఆయన అంత బాగా అర్థం చేసుకోబట్టే కదా.. నేను సొంత ఇంట్లో వేరుగా ఉంటుంది" అంటాడు సాగర్ బాధగా.

నాన్న అంటే నాకు ప్రాణంరా.. ఆ ఒక్క విషయంలో మాత్రం

నాన్న అంటే నాకు ప్రాణంరా.. ఆ ఒక్క విషయంలో మాత్రం

"సాగర్.. అందరూ సంతోషంగా ఉన్నప్పుడు ఎందుకు బాధపెట్టేలా మాట్లాడతావు" అంటుంది నర్మద. దీంతో ప్రేమకు కంగ్రాట్చ్యూలేషన్స్ చెబుతాడు సాగర్. "నువ్వు వేరు కాపురం పెట్టగానే నువ్వు ఒక్కడిది ఒక పార్టీ అని.. మిమ్మల్ని శత్రువుల్లాగా.. ప్రత్యర్థుల్లాగా చూస్తున్నావని అనుకున్నాం. కానీ ఇలా కంగ్రాట్స్ చెప్తున్నావంటే షాకింగ్ గా ఉంది " అంటాడు ధీరజ్. "రేయ్.. నా కోపం నా బాధ మీ నాన్న మీదే. అది కూడా నాకు నచ్చినట్లు కాకుండా ఆయన శాసించినట్లుగా రైస్ మిల్లులో పనిచేయమన్నాడు చూడు. ఆ ఒక్క విషయంలోనే ఆయనంటే కోపం. కానీ కన్నతండ్రిగా ఆయనంటే ఎంత ప్రేమో.. అంతే గౌరవంరా నాకు. రేయ్.. నువ్వంటే నాకు కాస్తో కూస్తో కోపం రా నాకు.

చూస్తానే.. ఎన్నాళ్లు సంతోషంగా ఉంటారో

చూస్తానే.. ఎన్నాళ్లు సంతోషంగా ఉంటారో

ఎందుకంటే నా విషయంలో నువ్వు అర్థం చేసుకోకుండా మీ నాన్నకే సపోర్ట్ చేశావు" అంటాడు సాగర్ బాధగా. రేయ్ నడిపోడా.. "కాస్తా మారరా.. అందరితో కలిసి సంతోషంగా ఉండరా" అంటుంది వేదవతి. "బేసిగ్గా నేను మంచోడినే అమ్మా.. మీ అందరి వల్లే ఇలా తయారయ్యాను " అని చెప్పి వెళ్లిపోతాడు సాగర్. ఇక ప్రేమ పోలీస్ ఆఫీసర్ కాబోతుందనే సంతోషంలో వేదవతి, ధీరజ్, ప్రేమ, నర్మద సంతోషంగా డ్యాన్స్ చేస్తుంటారు. ఇదంతా చూస్తూ పగతో రలిగిపోతూ ఉంటుంది వల్లి. "ఈ సంతోషం ఇంకా ఎన్నాళ్లు ఉంటుందో నేను చూస్తాను"అని మనసులోనే అనుకుంటుంది వల్లి.

అమూల్యని ఏడిపిస్తార్రా.. మిమ్మల్ని చంపేస్తా..

అమూల్యని ఏడిపిస్తార్రా..  మిమ్మల్ని చంపేస్తా..

మరోవైపు కాలేజీలో అమూల్య నడుస్తూ వెళ్తుంటే కొందరు అబ్బాయిలు వెటకారంగా మాట్లాడుతూ వేధిస్తుంటారు. "రేయ్.. ఏంట్రా పిచ్చిగా పిచ్చిగా మాట్లాడుతున్నారు. మా అన్నయ్యలకు చెప్పానంటే తొక్కిపట్టి నారా తీస్తారు. ఎంత త్వరగా వెళ్లిపోతే మీకే అంత మంచిది" అంటుంది అమూల్య కోపంగా. అయినా ఆకతాయిలు వినకుండా అమూల్య చేయి పట్టుకుని ఏడిపిస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి వచ్చిన విశ్వ.. ఆకతాయిలను లాగిపెట్టి కొడతాడు. "మామ దాని కోసం మిమ్మల్ని కొడతావేంట్రా "అని అనడంతో.. దాన్నేంట్రా అంటూ మరోసారి లాగిపెట్టి కొడతాడు విశ్వ. దీంతో అందరూ ఆకతాయిలు అక్కడి నుంచి పారిపోతారు.

నన్ను క్షమించు అమూల్యా..

నన్ను క్షమించు అమూల్యా..

మరోవైపు అమూల్య కోపంగా వెళ్లిపోతుంటే.. "సారీ అమూల్య.. వాళ్లు ఏడిపించినందుకు సారీ అమూల్య.. ఇంకా వాళ్లు నీ జోలికి రారు.. నువ్వు ధైర్యంగా కాలేజీకి వెళ్లొచ్చు" అంటాడు విశ్వక్. "వావ్.. సూపర్.. చాలా తెలివిగా కొత్త డ్రామా మొదలుపెట్టావుగా " అంటుంది అమూల్య కోపంగా. "అయ్యో. డ్రామాలు ఏంటీ అమూల్య" అంటాడు విశ్వక్. "మంచోడిగా మార్కులు కొట్టేయడం కోసం.. నా దగ్గర సింపతి కొట్టేయడం కోసం వాళ్లతో కలిసి ఇదంతా ప్లాన్ చేశావని నాకు తెలియదు అనుకుంటున్నావా" అంటుంది అమూల్య. "అయ్యో.. నువ్వు పొరపాటు పడుతున్నావు అమూల్య.. నన్ను అపార్థం చేసుకుంటున్నావు.

ఇంకోసారి ఇలాంటి వెధవ వేషాలు వేస్తే.. మా అన్నయ్యతో తన్నిస్తా

ఇంకోసారి ఇలాంటి వెధవ వేషాలు వేస్తే.. మా అన్నయ్యతో తన్నిస్తా

ఆ యెదవలు నిన్ను ఏడిపిస్తుంటే వచ్చి నిన్ను కాపాడానే తప్ప.. వాళ్లకు నాకు ఎలాంటి సంబంధం లేదు" అంటుంది విశ్వక్. "వద్దు.. డ్రామాలు వద్దు. నువ్వు ఇకనైనా బుద్ధి తెచ్చుకుని మారతావని కేసు వెనక్కి తీసుకున్నాను. ప్రతి క్షణం అది గుర్తుపెట్టుకుని ఒళ్లు దగ్గరపెట్టుకుని ఉండు. అలా కాకుండా ఇలా చీప్ ట్రిక్స్ ప్లే చేసినా.. నా జోలికి వచ్చినా మా అన్నయ్యలను మీ ఇంటికి తీసుకొచ్చి మరీ కొట్టిస్తాను " అంటూ వార్నింగ్ ఇస్తుంది అమూల్య. "అమూల్య.. ఇందులో ఎలాంటి డ్రామా లేదు. నన్ను నమ్ము" అంటూ రిక్వెస్ట్ చేస్తాడు విశ్వక్.

తన విలువ తెలిసిందిరా మామా.. అమూల్యే నా జీవితం

తన విలువ తెలిసిందిరా మామా.. అమూల్యే నా జీవితం

"చచ్చినా నేను నిన్ను నమ్మను. అనవసరంగా మా అన్నయ్య వాళ్ల చేతిలో చచ్చిపోకు" అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది అమూల్య. అప్పుడే ఆకతాయిలు మరోసారి విశ్వక్ వద్దకు వస్తారు. "అది కాదు రా మామ.. నువ్వే ఆ అమ్మాయిని ఏడిపించావని మాకు చెప్పావు. ఇప్పుడు నువ్వే తనను బతిమిలాడుకుంటున్నావు. ఏంటీ మామ ఇదంతా" అంటారు. "తన విలువ తెలియనప్పుడు తనను ఏడిపించాను రా... తన విలువ తెలిసాకా.. తను నా జీవితం ఉండాలని తనే జీవితం అవ్వాలని కోరుకుంటున్నాను.అందుకోసం తను ఎంతలా అవమానించినా భరిస్తాను. ఎన్నిసార్లైనా క్షమాపణ అడుగుతాను. నన్ను నమ్మి అర్థం చేసుకునేంతవరకు ఇలా ప్రయత్నిస్తూనే ఉంటాను" అంటాడు విశ్వక్.

నేను కొట్ట బోయే దెబ్బకి ప్రేమ జీవితం సర్వ నాశనం

నేను కొట్ట బోయే దెబ్బకి ప్రేమ జీవితం సర్వ నాశనం

కట్ చేస్తే.. భాగ్యం ఇంట్లో కూర్చుని రాళ్ల ఆట ఆడుతుంది వల్లి. "అమ్మడు.. కొత్తకోక వింత పాతోక రోక అన్నట్లు .. ఈ పులి మేక ఆట ఏంటీ" అంటుంది భాగ్యం అనుమానంగా. "ఈ పులి పంజాకు ప్రేమ అనే మేక దొరికింది" అంటుంది వల్లి పొగరుగా. "ఓసేయ్.. నీకు బుర్ర ఉందా ఏమైనా.. ఎంత మంచి బ్రహ్మాస్త్రం లాంటి అస్త్రం దొరికితే మీ మామయ్యగారికి చెప్పేసి నట్టింటా భూకంపం సృష్టించగా.. ఆటలు ఆడుకుంటున్నావా ఆటలు" అంటుంది భాగ్యం. "ఇప్పుడు నేను ప్రేమను కొట్టబోయే దెబ్బ మాములుగా ఉండదు. పులి పంజా విసిరి చాచికొడితే మేక ఎట్టగైతే గిల గిల కొట్టుకుంటూ నేలమీద పడ్తుందో.. ప్రేమ దాని కాపురం కూడా అట్టాగే విల విలలాడుతూ కూలిపోవాలి" అంటుంది శ్రీవల్లి.

వీడొకడూ..

వీడొకడూ..

అప్పుడే దూరంగా ఉండి సుక్కుకు లైన్ వేస్తుంటాడు తిరుపతి. "తర్వాత వస్తాను వెళ్లు " అంటూ సైగలు చేస్తుంటుంది సుక్కు. మరోవైపు వల్లి కోపంతో రగిలిపోతూ.. "మనం పెట్టే మందు పాత్రలో రెండు కుటుంబాల మధ్య యుద్దం జరగాలి. దెబ్బకు ధీరజ్, ప్రేమ విడిపోవాలి. వాళ్ల కాపురం ముక్కలు ముక్కలు అయిపోవాలి. అందుకు మీరు ఏం చేయాలంటే " అని వల్లి చెబుతూ సుక్కూను చూస్తుంది. దీంతో సుక్కూ చేతులు ఊపుతూ కవర్ చేస్తుంది. "నేను ఇంత సీరియస్ మ్యాటర్ చెప్తుంటే ఈ తింగరిది గాల్లో కరాటే చేస్తుందేంటీ" అని మనసులోనే అనుకుంటుంది వల్లి.

ఆ రహస్యం తెలియాలంటే.. మోపిదేవి వెళ్లాల్సిందే

ఆ రహస్యం తెలియాలంటే.. మోపిదేవి వెళ్లాల్సిందే

అప్పుడే సుక్కు కోసం తిరుపతి విసిరిన గులాబీ పువ్వు వచ్చి వల్లి తల్లో పడుతుంది. వెంటనే వల్లి పువ్వు తీసి.. "బోడి గుండుకు బోండు మల్లెలు అన్నట్లు.. ఈ పువ్వులేంటీ.. ఈ సైగలెంటీ" అంటుంది వల్లి కోపంగా సుక్కుతో.. "అమ్మడు.. కొత్త స్కాంకు రిబ్బన్ కటింగ్ చేశాను గానీ.. ఈ విషయం కాసేపు పక్కనపెట్టి.. ప్రేమ, ధీరజ్ ల కాపురం కూల్చేసే స్కీం ఏంటో చెప్పు " అంటుంది భాగ్యం. "ప్రేమ, ధీరజ్ లది లవ్ మ్యారేజ్ ఏం కాదు. వాళ్లు అసలు ప్రేమించుకోనే ప్రేమించుకోలేదు. వాళ్లిద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం లేకుండా పెళ్లి జరిగింది. ఆ ఇష్టం ఎలా జరిగింది.. ఎట్టాంటి పరిస్థితుల్లో జరిగిందో తెలుసుకోవాలంటే.. వాళ్ల పెళ్లి జరిగిన ఊరు మీరు మోపిదేవి వెళ్లాలి" అంటూ భాగ్యంకు తన ప్లాన్ వివరిస్తుంది వల్లి.

ప్రేమ కాపురం ఊదేస్తా..

ప్రేమ కాపురం ఊదేస్తా..

"ప్లాన్ అర్థమైంది కదా.. మీరు ఉన్నపలంగా మోపిదేవి వెళ్లాలి. డబ్బులు రెడీ చేసుకోండి" అంటుంది వల్లి. "నువ్వు చెప్పినట్లు చేయాలి అంటే ఈజీగా రెండు మూడు లక్షలు అవుతాయి" అంటుంది భాగ్యం. "సరే మన రైస్ మిల్లు ఉందిగా..మా నాన్న చేతివాటం చూపిస్తాడు లే. కొంపలు, కాపురాలు కూల్చడానికి ఆ మాత్రం సాహసం చేయాలి. తప్పదు. మేక సచ్చింది.. ప్రేమ కాపురం ముక్కలు అవ్వడం కాదు.. బుడిద అవ్వబోతుంది " అంటుంది వల్లి. మరోవైపు ప్రేమను పోలీస్ ట్రైనింగ్ అకాడమీలో జాయిన్ చేసేందుకు తీసుకెళ్తాడు ధీరజ్. అక్కడ జరిగిన నాటకీయం ఏంటో తరువాతి ఎపిసోడ్‌లో చూద్దాం.

శేఖర్ కుసుమ

రచయిత గురించిశేఖర్ కుసుమశేఖర్ కుసుమ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 14 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2017లో సమయంలో చేరిన శేఖర్ కుసుమ.. సినిమా, టీవీ రంగాలకు సంబంధించిన అప్డేట్స్, ప్రత్యేక కథనాలు రాస్తున్నారు. హ్యూమన్ ఇంట్రస్ట్ రియల్ స్టోరీలు, కథలు, సినిమా రివ్యూలు అందిస్తుంటారు. సినిమా, టీవీ రంగాలకు సంబంధించి పలువురు సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేసిన అనుభవం శేఖర్‌కు ఉంది. క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి గత మూడు ఎన్నికల కోసం గ్రౌండ్ రిపోర్ట్ అందించిన అనుభవం ఉంది. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ టైమ్స్ ఇంటర్నెట్ అందించే మ్యాజికల్ మోటివేటర్ (2023), సూపర్ స్టార్ (2022), అబౌవ్ అండ్ బియాండ్ ది కాల్ ఆఫ్ డ్యూటీ (2019), ఇతర అవార్డులు శేఖర్ కుసుమకు లభించాయి. శేఖర్ కుసుమ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. అనంతరం ఎన్టీవీ జర్నలిజం స్కూల్‌‌‌‌లో వెబ్ అండ్ టీవీ జర్నలిజం కోర్సును పూర్తి చేశారు. ఎన్టీవీలో న్యూస్ ప్రొడ్యుసర్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. ఆ సమయంలో సినిమా, పొలిటికల్ న్యూస్ రాశారు. ఖాళీ సమయంలో సినిమాలు చూడటం, కథలు రాయడం, పుస్తకాలు చదవడాన్ని ఆయన ఇష్టపడతారు.... ఇంకా చదవండి

సంభాషణను ప్రారంభించండి
telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.