రెండు రోజుల పాటు ఆమె లుక్స్ విశేషంగా ఆకట్టుకున్నప్పటికీ ప్రధానంగా రత్నాలు పొదిగిన ఆమె ఆభరణాలే ఈ ఈవెంట్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. సెలబ్రిటీ జ్యువెల్లరీ నిపుణుడైన ప్రియాన్షు గోయల్ తెలిపిన వివరాల ప్రకారం.. సుధారెడ్డి ధరించిన ఈ నగలు ఆమె పర్సనల్ కలెక్షన్‌లోనివని, వీటి విలువ సుమారు రూ.280 కోట్ల వరకు ఉంటుందని సమాచారం.
జార్జియో అర్మానీ షోలో..
సుధా రెడ్డి జార్జియో అర్మానీ షో కోసం ఆ బ్రాండ్ కలెక్షన్ నుంచి నీలిరంగు స్కల్ట్పెడ్ దుస్తుల్లో విచ్చేశారు. ఎలాంటి ఆడంబరం లేని హుందాతనం, మెరిసే ఆకృతితో ఉన్న ఈ దుస్తులు ఎలాంటి ఆర్భాటం లేని విలాసవంతమైన శైలిని సరికొత్తగా ఆవిష్కరించాయి.ఆమె ఈ డ్రస్‌కి తగ్గట్లుగానే 30 క్యారెట్ల వజ్రాలు పొదిగిన పాంథర్ ఇయర్ కఫ్స్ ధరించారు. అంతే కాకుండా ఆమె పెట్టుకున్న 23 క్యారెట్ల పసుపు రంగు వజ్రపు ఉంగరం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీని విలువ సుమారు రూ.20 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇక ఆమె మరో చేతికి 30 క్యారెట్ల రోజ్ కట్ వజ్రపు ఉంగరాన్ని ధరించారు. ఆమె లుక్స్‌లో ఇవి మెయిన్ హైలైట్.
ఎలీ సాబ్ రన్‌వే షోలో..
సుధా రెడ్డి ఎలీ సాబ్ రన్‌వే షోలో కూడా అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ వేడుక కోసం ఆమె దుపట్టాతో కూడిన స్ట్రాప్‌లెస్ ఫ్లోరల్ గౌన్ ధరించారు. సింపుల్ స్టైల్, సున్నితమైన ఫ్లవర్ ఎంబ్రాయిడరీ వర్క్‌తో రూపొందించిన ఈ స్పెషల్ డిజైనర్ వేర్‌కు తగినట్లుగా ఆమె తన కలెక్షన్‌లోని సంప్రదాయ ఆభరణాలను ధరించి మెరిసిపోయారు.ఎలీ సాబ్ రూపొందించిన టర్కోయిస్ ఇయర్ కఫ్స్, ఆమె ధరించిన అద్భుతమైన దుస్తుల అందాన్ని ఏమాత్రం తగ్గించకుండా అందరి దృష్టిని వెంటనే ఆకర్షించాయి. ఈ ఇయర్ కఫ్స్‌లో పొదిగిన టర్కోయిస్ డైమండ్, గతంలో సల్మాన్ ఖాన్ తన బ్రాస్‌లెట్‌లో ధరించిన డైమండ్ వంటిదేనని సెలబ్రిటీ జ్యువెల్లరీ నిపుణుడు ప్రియాన్షు గోయల్ పేర్కొన్నారు.
మనీష్ మల్హోత్రా పారిస్ షోలో..
పారిస్ కోచర్ వీక్‌లో మనీష్ మల్హోత్రా తొలిసారిగా నిర్వహించిన షోలో సుధారెడ్డి, చేతి ఎంబ్రాయిడరీ వర్క్‌గల కార్సెట్ సిల్హౌట్ దుస్తులను ఎంచుకున్నారు. ఈ దుస్తుల యొక్క స్పెషల్ డిజైన్, స్టైల్ అద్భుతమైన టైలరింగ్ స్కిల్‌ని మరింత హైలైట్ చేశాయి.ఈ దుస్తులపై చేత్తో ఎంబ్రాయిడరీ చేసిన త్రీ డైమెన్షనల్ ఫ్లవర్ డిజైన్లు ఉన్నాయి. దీనికి తోడు మనీష్ మల్హోత్రా కలెక్షన్ నుంచి స్పెషల్‌గా రూపొందించిన డైమండ్ బో నెక్లెస్‌ను ఆమె ధరించారు. పర్షియన్ డిజైన్ స్ఫూర్తితో రూపొందించిన ఫ్లవర్ ఆకృతి గత హెయిర్ యాక్సెసరీ ఆమె లుక్‌ను మరింత అందంగా మార్చింది. ఈ నెక్లెస్‌లో అత్యుత్తమ నాణ్యత కలిగిన 75 క్యారెట్ల సహజ వజ్రాలను పొదిగారని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఆమె పెట్టుకున్న డైమండ్ హెయిర్ క్లిప్ విలువ రూ.2 కోట్లు ఉంటుందని తెలిపారు.
ముఖ్య గమనిక: ఈ కథనంలోని సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, కొందరు నిపుణులు పేర్కొన్న అంశాల ఆధారంగా తెలియజేశాము. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవు. వీటిని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.







