ఇందులో ఉండే పైపరిన్ అనే సహజ సమ్మేళనానికి యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. వీటిలో మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, సి, కె విటమిన్లు, ఫైబర్ వంటి పోషకాలు ఉంటాయి. దీనిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. వర్షాకాలంలో జలుబు, గొంతు నొప్పిని తగ్గించడానికి మిరియాలు ఎంత ఎఫెక్టివ్‌గా సహాయపడతాయో ఈ స్టోరీలో చూద్దాం..
గొంతునొప్పి నుంచి ఉపశమనం
జలుబు వచ్చినప్పుడు గొంతులో మంట, నొప్పి, గరుకుదనం వంటి సమస్యలు సాధారణం. గోరువెచ్చని నీటిలో చిటికెడు మిరియాల పొడి కలిపి తీసుకున్నా, తేనెతో కొద్దిగా మిరియాల పొడి కలిపి తీసుకున్నా గొంతు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. దీనిలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీఆక్సిడెంట్ గుణాలు గొంతు చికాకును దూరం చేస్తాయి. గొంతులోని కఫాన్ని పలుచన చేసి రిలీఫ్ ఇస్తాయి.జలుబు, దగ్గు నుంచి ఉపశమనం
నల్ల మిరియాలలో పైపరిన్ ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. అంతే కాకుండా.. యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఇవి గొంతు నొప్పి, దగ్గు, ముక్కు దిబ్బడ సమస్యను పరిష్కరిస్తాయి. ఆయుర్వేదం ప్రకారం మిరియాలు శరీరంలో పేరుకుపోయిన కఫాన్ని కరిగించే గుణాలు ఉంటాయి. దీంతో కఫం బయటకు రావడం సులభమై, ఛాతీలో బరువుగా అనిపించే భావన కొంత తగ్గుతుంది. ఉపశమనం కోసం మిరియాల పొడిని తేనె లేదా అల్లం టీతో కలిపి తీసుకోండి.ఇమ్యూనిటీ పెంచుతుంది
మిరియాలలో విటమిన్ సి, విటమిన్ ఎ, ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్ వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే పైపరైన్ అనే సమ్మేళం శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. మిరియాలను తరచు తీసుకుంటే రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. ఇన్ఫెక్షన్లు, రోగాలు రాకుండా అడ్డుకుంటుంది. మిరియాలలో ఉండే యాంటీమైక్రోబియల్ గుణాలు, తేమతో కూడిన వర్షాకాలంలో వృద్ధి చెందే హానికరమైన బ్యాక్టీరియా, క్రిముల నుంచి మీ శరీరాన్ని రక్షిస్తుంది.ఎలా తీసుకోవాలంటే
- తేనెలో చిటికెడు మిరియాలు పొడి కలిపి తీసుకోవచ్చు.
- మిరియాలు, అల్లం, తులసి ఆకులు వేసి కషాయం చేసుకుని తీసుకోవచ్చు.
- పాలలో చిటికెడు మిరియాల పొడి కలుపుకుని తాగొచ్చు.
- మిరియాల రసం చేసుకుని తాగొచ్చు.
మిరియాలు వాడేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించండి
మిరియాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల కొందరిలో కడుపులో మంట, అసౌకర్యం కలగవచ్చు. చిన్నపిల్లలు, గర్భిణులు, అల్సర్, జీర్ణాశయ సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి. అలాగే జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, మూడు రోజులకంటే ఎక్కువ దగ్గు వంటి లక్షణాలు ఉంటే ఇంటి చిట్కాలపై ఆధారపడకుండా డాక్టర్‌ను సంప్రదించండి.ముఖ్య గమనిక: ఈ కథనంలోని సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, కొందరు నిపుణులు పేర్కొన్న అంశాల ఆధారంగా తెలియజేశాము. వీటిని పాటించే ముందు నిపుణుల సలహా తీసుకోండి. అలాగే వీటిని ఎంత వరకు పాటించాలనేది, విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం. సమయం తెలుగు వీటిని ధృవీకరించడం లేదు.







